25/08/2026
A smooth sea never made a skilled sailor. 🌊🪷
జీవితంలో కష్టాలే రాకూడదు అని కోరుకోకు. అది ఎవరికీ సాధ్యం కాదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే మనోధైర్యం ఇవ్వమని ఆ భగవంతుడిని అడుగు. కష్టాలే నిన్ను బలవంతుడిగా మారుస్తాయి.
23/08/2026
Even the purest gold is tested by fire. Don't fear criticism! 🏹🔱
నిన్ను ఎవరో ఏదో అన్నారని బాధపడకు. ధర్మాన్ని నిలబెట్టిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడికే ఈ లోకంలో నిందలు తప్పలేదు.. మనం ఎంత? వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయ్, నీ కర్మ (పని) నువ్వు చేసుకుంటూ పో.
21/08/2026
Never confuse silence with weakness. 🏔️✨
మౌనం అంటే చేతకానితనం కాదు. వందమంది ముందు అనవసరంగా వాదించడం కంటే.. సైలెంట్ గా ఉండి నీ సక్సెస్ తో సమాధానం చెప్పు. అది నీ విలువను అమాంతం పెంచుతుంది.
19/08/2026
Patience is not passive; it is concentrated strength! 🛡️⏳
ఓపిక, సహనం నీలో ఉంటే... కత్తి కన్నా పదునైన, బలమైన ఆయుధం నీ దగ్గర ఉన్నట్టే. కోపంతో తీసుకునే నిర్ణయం కన్నా, ఓర్పుతో వేసే అడుగే ఎప్పుడూ గెలుస్తుంది.